ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంతో చిత్రపరిశ్రమ చర్చలు జరుపుతోంది. పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారం, తాజా పరిణామాలపై చర్చించారు. పరిశ్రమకు సంబంధించి ఇది చాలా కీలకమైన భేటీ. అలాగే.. అల్లు అరవింద్(Allu Aravindh) కుటుంబానికి కూడా అనే ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమా రిలీజ్, సంథ్య థియేటర్ ఘటనే సీఎంతో భేటీకి మూల కారణం. కీలక భేటీకి పరిశ్రమలో అత్యంత కీలకంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏపీ మాజీ సీఎం జగన్(Jagan)తో ఇండస్ట్రీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరయ్యారు.
పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని వినమృంగా జగన్ ను అభ్యర్థించారు. అప్పట్లో చిరంజీవి చొరవ ప్రశంసలు అందుకుంది. అయితే.. ఈరోజు జరుగుతున్న భేటీకి చిరంజీవి హాజరు కాలేకపోయారు. ఇదే సమయంలో ఆయన చెన్నయ్ లో ఉన్నారు. సమావేశం గురించి ఎఫ్ డీ సీ (Fdc) ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)) చిరంజీవికి సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే చిరంజీవి షెడ్యూల్ ఖరారైంది. కొన్ని వివాహాలు, ఇతర ఫంక్షన్లకు సంబంధించి హాజరయ్యేలా చిరంజీవి తన షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి సినీ పరిశ్రమకు ఇచ్చిన సమయం చిరంజీవి చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చే సమయం లేదని మెగాస్టార్ టీమ్ వర్గాలు చెబుతున్నాయి.
…………………………………………