* కిక్కిరిసిన మెదక్ చర్చి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చిల్లో ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన మెదక్ సీఎస్ ఐ (CSI) చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునే మొదలైన ఈ మహోత్సవంలో, చర్చి ఆవరణలో శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు. భక్తులకు దైవ సందేశాన్ని అందించిన మోడరేటర్ ఇంచార్జ్ బిషప్ రూబెన్ మార్క్, న్యూ ఇయర్ వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హైదరాబాద్లోని కల్వరీ టెంపుల్ (Kalvari Temple)కు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏసు జన్మ వృతంతాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. ఆబిడ్స్ (Abids) లో చర్చి ఆవరణలో ఏసును శిలువు వేసిన విధానాన్ని నాటిక రూపంలో ప్రదర్శించారు.
…………………………………………..

