
* సత్తా చాటిన తెలుగువాళ్లు
ఆకేరు న్యూస్, డెస్క్ : సివిల్స్ – 2024 ఫలితాలు ఈరోజు రీలీజ్ అయ్యాయి. యూపీఎస్సీ ఫలితాలను (CIVILS RESULTS) విడుదల చేసింది. సివిల్స్ లో యూపీకి చెందిన శక్తి దూబేకు మొదటి ర్యాంకు వచ్చింది. హర్షితా గోయల్‌కు రెండో ర్యాంకు వచ్చింది. పరాగ్‌కు మూడో ర్యాంకు సాధించారు. తెలుగు వాళ్లు కూడా సత్తా చాటారు. తెలుగు అభ్యర్థి సాయి శివాని(SAI SIVANI)కి 11వ ర్యాంక్ వచ్చింది. బన్న వెంకటేష్ 15వ ర్యాంక్, రావుల జై సింహ రెడ్డి 46 వ ర్యాంక్ సాధించారు. అలాగే శ్రవణ్‌కుమార్ రెడ్డి-62, సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు, చేతన రెడ్డి-110, శివ గణేష్ రెడ్డి-119, శ్రీకాంత్ రెడ్డి-151వ ర్యాంక్ సాధించారు. మొత్తంగా 1009 మంది అభ్యర్థులు సివిల్స్‌కు ఎంపికయ్యారు. జనరల్ కోటలో 335 మంది అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ కోటలో 109 మంది అభ్యర్థులు, ఓబీసీ కోటాలో 318 మంది అభ్యర్థులు, ఎస్సీలు 160, ఎస్టీలు 87 చొప్పున మొత్తం 1009 మంది అభ్యర్థులు సివిల్స్‌కి ఎంపికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS), ఐఎఫ్ఎస్ (IFS) తదితర సర్వీసుల కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జూన్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి జనవరి 7 నుండి ఏప్రిల్ 17 వరకు దశల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ, ఇప్పుడు తుది ఫలితాలను విడుదల చేసింది.
……………………………………………..