Abhijeet Dipke, CJP Jantar Mantar Protest
* జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు CJP డిమాండ్
ఆకేరు న్యూస్, డెస్క్: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరో నిరసనకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉన్న తమ మద్దతుదారులు ఢిల్లీకి తరలివచ్చి నిరసనలో పాల్గొంటారని దీప్కే తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన అంశాలపై తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
* శాంతియుత నిరసన
అక్టోబర్ 10న చేపట్టబోయే కార్యక్రమం శాంతియుతంగా ఉంటుందని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. గాంధేయ మార్గంలో నిరసన కొనసాగిస్తామని పేర్కొంటూ, పాల్గొనే వారు క్రమశిక్షణతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో పాటు ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన తమ అభ్యంతరాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు CJP వర్గాలు తెలిపాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
