* ఇండియా టార్గెట్ 237
* రోహిత్ శర్మ, విరాట్ కోష్లీపైనే అశలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో కనీసం మూడో వండే లోనైనా భారత్ గెలుస్తుందా.. పరువు నిలుపుకుంటుందా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మూడు వండేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ లో ఇండియా ఇప్పటికే రెండు మ్యాచ్ లను ఓడిపోయి సిరీస్ కోల్పోయింది, సిడ్నీలో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ పేస్ బౌలర్ హర్షత్ రాణా 39 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాజ్ గెలవాలంటే భారత జట్టు 237 పరుగులు సాధించాల్సి ఉంటుంది. భారత దిగ్గజ బ్యాట్స్ మెన్లు విరాట్ కోష్లి, రోహిత్ శర్మలపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. కనీసం ఆఖరి మ్యాచ్ గెలిస్తే క్లీన్ స్వీప్ కాకుండా పరువు నిలుపుకున్నట్లుగా ఉంటుంది.
…………………………………………….
