
* అరగంటలో 13 సెం.మీల వర్షపాతం
* జలమయమైన ప్రధాన రహదారులు
* నీటమునిగిన ఆటోనగర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ (HYDERABAD) నగర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మెదక్ (MEDAK)జిల్లాలో అయితే ఏకంగా క్లౌడ్ బరస్ట్ అయింది. అరగంటలో 13 సెంటిమీటర్ల వర్షం కురవడంతో పట్టణం ఆగమాగమవుతోంది. ఆటోనగర్కాలనీ పూర్తిగా నీట మునిగింది. ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడంతో రోడ్లపైకి వరద పోటెత్తింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా నార్త్ లోను, పర్వత ప్రాంతాల్లో ఉండే క్లౌడ్ బరస్ట్ మెదక్ జిల్లాలో నమోదుకావడం కలకలం రేపుతోంది. మెదక్ పట్టణంలోని ప్రధాన రహదారులు నీట మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్త బస్టాండ్ వెళ్లే రోడ్డు నీట మునగడంతో జేసీబీలతో నీటిని తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవలే భారీ వర్షాలతో మెదక్ అతలాకుతలం అయింది. ఇప్పుడు ఏకంగా క్లౌడ్ బరస్ట్ (CLOUD BURREST) తో జనజీవనం స్తంభించింది. కాగా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం కురిస్తే దానిని క్లౌడ్‌బరస్ట్ గా పరిగణిస్తారు.
……………………………………………..