ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈనెల 26 (బుధవారం ) జూబ్లీహిల్స్ ఎంఎల్ ఏ నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్‌తో ఎంఎల్ ఏగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జీ మీనాక్షీ నగరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు హాజరుకానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు.
……………………………………………………..
