
*ఫోన్ లో కౌన్సిలింగ్ ఇచ్చిన రేవంత్
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రుల పని తీరుపై సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ ముగ్గురికీ ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక జరుగనున్న నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైనా జూబ్లీహిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయాలనే పట్టుదలతో ఉన్నారు, ఇటీవలే మరణించినబీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ కు ప్రాతినిధ్యం వహించారు. జూబ్లీహిల్స్ ఏరియాలో మాగంటి గోపీనాథ్ కు మంచి పట్టుంది. బీఆర్ ఎస్ క్యాడర్ ఉంది. ఆయన ఆకాల మరణం చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేష్ వచ్చే అవకాశం ఉన్నందున జూబ్లీహిల్స్ లో పార్టీని గెలిపించే బాధ్యత ముగురు మంత్రులకు అప్పజెప్పారు. ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు తుమ్మల నాగేశ్వర్ రావు, వివేక్ వెంకటస్వామిలకుకాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను సీఎం అప్పజెప్పారు. నియోజకవర్గంలో పర్యటిస్లూ క్యాడర్ ను పటిష్టం చేయడం స్థానిక నేతలతో సంబంధాలు పెంచుకోవడం,పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలుఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపధ్యంలో తమకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్థించడం లేదని సీ ఎం అభిప్రాయపడుతున్నారు. మంత్రుల పని తీరు సంతృప్తికరంగా లేదని పార్టీ అనుకున్న స్థాయిలో పుంచుకోవడంలేదనే వేదికలను సీఎంకు నిఘా సంస్థలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే సీఎం ముగ్గురుమంత్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
………………………………………