* సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సీఎస్, డీజీపీలకు ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సౌదీ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సీఎం, డీజీపీకి ఆదేశాలిచ్చారు. తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యల కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సమాచారం నిమిత్తం సచివాలయంలో ప్రత్యేకంగా 79979 59754, 99129 19545 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మల్లేపల్లిలోని బజార్ ఘాట్‌కు చెందిన 16 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఉమ్రా ట్రావెల్స్ ద్వారా మక్కా యాత్రకు వెళ్లినట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అక్కడి ఇంగ్లిష్ మీడియా కథనాలు వెల్లడించాయి. తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
……………………………………………………..
