ఆకేరున్యూస్, హైదరాబాద్: భారత రాష్ట్రపతి గౌరవ ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
…………………………………….