
* భౌతిక కాయాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (73) అనారోగ్యంతో ఈ నెల ఒకటిన రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రజలు, కాంగ్రెస్ నాయకుల సందర్శనార్థం ఈరోజు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. దామోదర్ రెడ్డి (Damoder reddy) కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాంరెడ్డి మృతి కాంగ్రెస్ తో పాటు నల్గొండ జిల్లాకు తీరని లోటని అన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam prabhakar), పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas reddy), ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి తదితరులు దామోదర్‌రెడ్డికి నివాళి అర్పించారు. కాగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో ఐటీ మంత్రిగా పనిచేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందారు. తుంగతుర్తిలో శనివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
…………………………………………………….