* గద్దెల ప్రాంగణం వద్ద ఫ్లడ్ లైటింగ్
* పనుల పురోగతిపై సీఎం సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మేడారం పనుల్లో రాజీ పడొద్దని..విమర్శలకు తావు లేకుండా పనులు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారంలో నిర్మాణ పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మక్క, సారలమ్మ గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దని సూచించారు. పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దని తెలిపారు. నిర్మాణంలో చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దని తెలిపారు. గద్దెల సమీపంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి, అక్కడే నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గడువు సమీపిస్తుండడంతో పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు నిర్వహించిన జాతరకంటే భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని.. అధికారులు సమన్వయంతో పని చేసి పనులు చేపట్టాలన్నారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా, సీఎంవో ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు పాల్గొన్నారు.
……………………………………………………….
