* సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ వ్యయంపై సీఎం రేవంత్ ఆగ్రహం
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ వ్యయం ఇష్టా రాజ్యంగా పెంచేస్తారా.. నిబంధనలు మీకు వర్తించవా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలించారు. నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 1100 కోట్లున్న నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ. 1726 కోట్లకు ఎలా పెంచుతారని నిలదీశారు. కేవలం మౌఖిక ఆదేశాలతోనే రూ. 626 కోట్ల వ్యయాన్ని ఏవిదంగా పెంచుతారని ప్రశ్నించారు. నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి సమగ్ర ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులో గా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు.
=—————————————-