* క్రిస్మస్ వేడులకు హాజరు
ఆకేరు న్యూస్, మెదక్ : క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (TELANGANA CM REVANTHREDDY) మెదక్ చర్చిని సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ సంబరాల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఈ చర్చితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడి(PCC PRESIDENT)గా ఉన్న సమయంలో ఇక్కడకు వచ్చి వచ్చే ఏడాది ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పానని అన్నారు. ప్రజలు ఆశీర్వదించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల్లో దళిత క్రైస్తవులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. వందేళ్ల క్రితం కరువు కాటకాలు ఉన్నప్పుడు, ప్రజలకు పని కల్పించాలని, భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ చర్చి నిర్మించారని తెలిపారు. దేశంలోనే గొప్ప దేవాలయంగా ఇది అభివృద్ధి చెందిందన్నారు. మరింత అభివృద్ధికి కావాల్సిన నిధులను తమ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేసినట్లు తెలిపారు.
……………………………………