* వేయి ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
* ఎయిర్ పోర్టు నుంచి గ్రీన్ చానల్
– సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్ : హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth reddy ) అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండలో మెడికవర్ అనే ప్రైవేట్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వ నగరంగా మారిన హైదరాబాద్ మెడికల్ టూరిజం హబ్‌గా ఏర్పాటుచేసేందుకు అవసరమైన అన్నీ హంగులు ఉన్నాయన్నారు. మద్య తూర్పు దేశాల ( Middle East Countries ) నుంచి ప్రజలు హైదరాబాద్, చెన్నయి నగరాలకు వైద్య అవసరాలకు ఎక్కువగా వస్తుంటారన్నారు. హైదరాబాద్ లోని శంశాబాద్ ఎయిర్ పోర్ట్‌కు దగ్గరలో వేయి ఎకరాలను సేకరిస్తామన్నారు. ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల మౌళిక వసతులను కల్పిస్తామన్నారు. అదే స్థలంలో అన్ని రకాల సౌకర్యాలతో ఆస్పత్రులను నిర్మించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి గ్రీన్ చానల్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
* హెల్త్ ప్రొఫైల్
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ ఉండే విదంగా ఏర్పాట్లు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. బ్లడ్ గ్రూప్‌తో పాటు అన్ని రకాల జబ్బుల వివరాలతో ఉండే ఒక యూనిక్ డిజిటల్ కార్డు ఉండే విదంగా ప్రయత్నిస్తామన్నారు. ఎక్కడికి వెళ్లినా ఈ వివరాల ద్వారా మెరుగైన చికిత్స పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ హాస్పిటల్‌కు ఎంత మంది వస్తున్నారన్న అంశం కంటే ఎంత మంది నవ్వుతూ అస్పత్రి నుంచి వెళుతున్నారనేది ముఖ్యమన్నారు. వరంగల్ హెల్త్ టూరిజం, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం గా రూపొందించడానికి అవసరమైన అన్ని రకాల హంగులు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ కడయిం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు..
—————————————————