* హైదరాబాద్ దశ-దిశ మార్చే ప్రణాళికలపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పలు కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సాయంత్రం సమీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జీహెచ్ ఎంసీ విలీనం, అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. అలాగే 6.30 గంటలకు బెంగళూరు-హైదరాబాద్ కొత్త నేషనల్ హైవేపై కూడా చర్చించనున్నారు. హైదరాబాద్ దశ-దిశ మార్చే ప్రణాళికలను పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమీక్షలు నిర్వహించనున్నారు. నిన్న రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక మార్గదర్శకంగా రూపొందిస్తున్న ‘తెలంగాణ రైజింగ్–2047’ పాలసీ(TG Rising Policy) డాక్యుమెంట్ పై రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సిద్ధం చేసిన ముసాయిదాను పరిశీలించి, భవిష్యత్ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పలు సూచనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి ధోరణులను పునర్వ్యవస్థీకరించి, ఆర్థిక రంగ ప్రగతిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టంగా తెలిపారు.
………………………………………………….
