
* పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
* తొలిసారిగా విద్యార్థులతో ముఖాముఖి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ(OSMANIA UNIVERSITY)ని సందర్శించారు. కాసేపటి క్రితమే ఇక్కడకు వచ్చిన ఆయన అక్కడి ఫొటో గ్యాలరీని సందర్శించారు. యూనివర్సిటీ లో బాయ్స్, గర్ల్స్ హాస్టల్ ను ప్రారంభించారు. రూ.80 కోట్లతో ఈ హాస్టల్ ను నిర్మించారు. దాదాపు ఇక్కడ 1200 మంది విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించనున్నారు. అలాగే మరో రెండు గిరిజన హాస్టళ్లకు రేవంత్ (REVANTH)శంకుస్థాపన చేశారు. డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్‌కు కూడా శంకుస్థాపన చేశారు. అలాగే, సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు. తొలిసారిగా సీఎం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సీఎంగా రేవంత్ తొలిసారి విచ్చేయడం సంతోషకరమని ఓయూ(OU)లోని కొన్ని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. సీఎం వెంట మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు ఉన్నారు. అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి వినతి మేరకు పలు ప్రతిపాదలను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా, సీఎం రేవంత్ రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు విద్యార్థులను ముందస్తు అరెస్టు చేశారు.
…………………………………….