
సీఎం రేవంత్ రెడ్డి
* పలువురు బీఆర్ ఎస్ నేతలు, రైతులు ముందస్తు అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (REVANTHREDDY) యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో నేడు పర్యటించనున్నారు. నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, తదితర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. సభకు 60వేల మంది హాజరవుతారన్న అంచనాలతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ మధ్యాహ్నం 3 గంటలకు తుర్కపల్లి మండలం తిర్మలాపురం చేరుకుంటారు. 3.10 నుంచి 3.25గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 3.25 నుంచి 4.40గంటల వరకు సభలో ప్రసంగించి, పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 4.45గంటలకు తిరుగుపయనమవుతారు. ఆయా కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(GUTHA SUKENDRA REDDY), మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు(THUMMALA NAGESWARA RAO), పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి(PONGULET SRINIVAS REDDY), పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ పాల్గొననున్నారు. ఇదిలాఉండగా, సీఎం పర్యటన నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు, ట్రిపుల్ ఆర్ రైతులు, మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వలిగొండలో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులను, రాజాపేటలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. సీఎం పర్యటన సజావుగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
……………………………………………..