
అమీర్ పెట్ మైత్రివనం వద్ద వరద పరిస్థితిపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం
* హైడ్రా కమిషనర్ తో కలిసి తనిఖీ
* బల్కంపేట బస్తీ వాసులతో మాట్లాడిన సీఎం
* సమస్యలను తక్షణమే పరిష్కారించాలని ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :హైదరాబాద్ లో గత వారం పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలు నీట మునిగాయి, రహదారులు నీట మునిగాయి, డ్రైనేజీల మురుగునీరు రోడ్లపైకి వచ్చి చేరింది.ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలను స్వయంగా పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ( CM REVANTH REDDY) హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలను ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాధ్ (RANGANATH) తో కలిసి పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు బల్కంపేట(BALKAMPETA)లోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.అందులోభాగంగా బస్తీ వాసులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మంచి నీరు ఎలా వస్తుంది.. అందులో ఏమైనా మురుగు నీరు కలుస్తుందా? అంటూ వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మైత్రీవనం (MYTRIVANAM) సమీపంలోని గంగూబాయి బస్తీని సైతం ఆయన సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
వరద పరిస్థితిని సీఎంకు వివరించిన బాలుడు
అమీర్ పేట బుద్ధ నగర్ లో ఏడో తరగతి బాలుడు జస్వంత్ ను పిలిచి వరద పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. కాలనీలో బాలుగు జస్వంత్ తో కలసి నడుస్తూ కాలనీ వివరాలు ఆరా తీశారు. కాలనీ దుస్థితిపై జస్వంత్ సీఎంకు వివరించారు. ఇంట్లోకి వరదనీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని జస్వంత్ సీఎంతో తన ఆవేదన వెలిబుచ్చాడు. దీంతో స్పందించన సీఎం భవిష్యత్ లో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి ధైర్యం చెప్పారు.
…………………………………