
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఐదుగురు యువకులు
కరెంట్ షాక్ కు గురై మృతిచెందారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.గోకుల్ నగర్ దగ్గర రథం
లాగుతుండగా కరెంట్ షాక్ కు గురై కృష్ణయాదవ్ (24),శ్రీకాంత్ రెడ్డి (35) రుద్రవికాస్ (39),రాజేందర్ రెడ్డి (39)సురేష్ (34) మృతి చెందారు. కాగా మరో నలుగురుతీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కేటీఆర్ విచారం
కృష్ణాష్టమి వేడుకల్లో ఐదుగురు యువకులు మృతి చెందడంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికిమెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
………………………………….