– అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయండి
– న్యాయవాదుల పోస్టుకార్డు ఉద్యమం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ‘సీఎం రేవంత్ రెడ్డి సార్.. మాకు రక్షణ కల్పించండి. తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయండి’ అంటూ న్యాయవాదులు కోరుతున్నారు. యాక్ట్ అమలు, న్యాయవాదులపై దాడులను వివరిస్తూ రేవంత్ రెడ్డి(Revanthreddy)కి పోస్టుకార్డులు రాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పోస్టుకార్డులను పోస్టు చేశారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు శేరి ప్రతాప్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి కార్తీక్ బాశెట్టి ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ (Bar Association) కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ కోసం రాష్ట్రంలో తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులను పంపించారు. అదే విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. పలు సందర్భాల్లో న్మాయవాదులు అభ్రతకు గురవుతున్నారని, న్యాయం కోసం వాదిస్తున్నా దాడులకు గురి కావాల్సి వస్తోందని వాపోయారు.
………………………………………………
