* హనుమకొండ, వరంగల్ , హుస్నాబాద్ వరద ప్రాంతాల విహంగ వీక్షణం
* హనుమకొండ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష
ఆకేరు న్యూస్, వరంగల్ : సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌కు రానున్నారు. మెంథా తుపాన్ తాకిడికి వరంగల్ నగరం జలదిగ్భందమైంది. పలుకాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెలికాప్టర్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాంతాలను పరిశీలిస్తారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు కూడా వరద తాకిడికి తీవ్రంగా నష్టపోయాయి. వరద తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశిలించడంతో పాటు వరంగల్ నగరంలోని కొన్ని ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు.. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం ఉంటుంది. అజారుద్దీన్ మంత్రి గా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన వరంగల్‌ను నేరుగా హెలికాప్టర్లో చేరుకుంటారని అధికారులు తెలిపారు.
———————————-
