* మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల
* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, మెదక్: మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రత్యేక విమానం ద్వారా ఏడుపాయలకి చేరుకున్నారు. దుర్గ భవాని మాతకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం ప్రత్యేకపూజలు చేసి ఆలయ పూజారుల ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత 750 కోట్ల పైచిలుకు రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పి. సి.సీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
………………………………….