 
                * బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం
* సమస్య పరిష్కారానికి స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం
* శాశ్వత పరిష్కారం కనుగొనాలని అధికారులకు ఆదేశం
ఆకేరు న్యూస్, వరంగల్ : సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్ నగరంలో పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ముందుగా ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం తరువాత కారులో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. వారి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తీవ్రంగా వరద తాకిడికి గురైన సమ్యయ్య నగర్ ,పోతన నగర్, రంగంపేట ప్రాంతాలను పరిశీలించారు. సమ్మయ్య నగర్ లో స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి సలహాలు స్వీకరించారు. స్థానికుల అభిప్రాయాలను పరిగణలో తీసుకోవాలని అధికారులను ఆదేశించిచారు. బాధితులకు తక్షణ సహాయం ప్రకటించారు,. ముఖ్యంగా సమ్మయ్య నగర్ కు మూడు ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది, ప్రతీ వర్షాకాలం సమ్మయ్య నగర్ పరిస్థితి పూర్తిగా అద్వాన్నంగా ఉంటుందనే విషయాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమ్మయ్యనగర్ వాసులకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి నయీం నగర్ నాలాను కూడా సందర్శించారు. పోతన నగర్, రంగంపేట ప్రాంతాల్లో వరద రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ లో వరద తాకిడి లేకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వరద నష్టంపై జరిగిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం
కలెక్టరేట్ లో వీక్షించనున్నారు. సీఎం వెంట జిల్ల ఇంజార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉన్నారు. అంతకు ముందు సీఎం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలు దేరిన సీఎం ముందుగా హుస్నాబాద్ పరిధిలోని పంట నష్టపోయిన ప్రాంతాలను వరద తాకిడికి గురైన ప్రాంతాలను సందర్శించారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్థానిక అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
………………………………………….

 
                     
                     
                    