
* నాలుగన్నర గంటలపాటు సాగిన విచారణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Mlc Pochampalli Srinivasreddy) విచారణ ముగిసింది. ఫాం హౌస్లో కోడిపందాల కేసులో మొయినాబాద్ పోలీసులు ఆయనను నాలుగున్నర గంటల పాటు విచారించారు. ఆయనకు గతంలోనే పోలీసులు నోటీసులు అందజేశారు. గతనెలలో తోల్కట్ట ఫాం హౌస్(Farm House)లో భారీగా కోడిపందాలు, క్యాసినో నిర్వహించారు. ఆ సందర్భంగా మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫాం హౌస్ తనదేకానీ, లీజుకు ఇచ్చాననని గతంలో పోచంపల్లి తెలిపారు. దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఆయనను తాజాగా పోలీసులు విచారించారు.
………………………………………..