Construction and Demolition Waste Management
అకేరు న్యూస్ హన్మకొండ :గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్మాణ (Construction) మరియు కూల్చివేత (Demolition) వ్యర్థాల నిర్వహణ అంశంపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లు, సంబంధిత అధికారులకు ఒకరోజు నాయకత్వ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆస్కీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధ్యక్షత వహించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని 15 మున్సిపాలిటీల మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, పారిశుద్ధ్య విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
