
– మూసీ ఉధృతి పరిశీలన
– అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
– అందుబాటులోకి ఎమర్జెన్సీ నంబర్లు
అకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది. రోజంతా ముసురు పట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ హరిచందన (Collector harichandana)వర్ష ప్రభావిత ప్రాంతాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వర్షం తీవ్రత అధికంగా ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో లంగర్‌హౌజ్‌లోని బాపుఘాట్ వద్ద మూసీనది (Musi River) ప్రవాహాన్ని కలెక్టర్ హరిచందన పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ విభాగాలతో కలిసి రెవెన్యూ అధికారులు పనిచేయాలన్నారు. నగరంలో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ 040-23202813, 7416687878 నంబర్లకు ఫోన్‌చేసి తెలియజేయాలని ప్రజలకు సూచించారు. కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
…………………………………….