* ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో కీలక పరిణామం..
* కేటీఆర్‌కు ఈడీ నోటీసులు..
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు రావాలని పేర్కొంది. కేటీఆర్‌తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు అందజేసింది. కాగా, అరవింద్ కుమార్ జనవరి 2న, బీఎల్ఎన్ రెడ్డి జనవరి 3న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు కింద ఈడీ విచారణ జరుపుతోంది.
……………………………………..