Comedian Ramachandra and Hero Sanjosh
* చికిత్స పొందుతున్న రామచంద్రకు పరామర్శ
* రూ.15 వేల ఆర్థిక సాయం అందజేత
* జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తానని హామీ
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ అండగా నిలిచారు. బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతంతో ఇబ్బందులు పడుతున్న రామచంద్రను సంజోష్ పరామర్శించి, రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా రామచంద్ర ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
* చికిత్సకు మరో రూ.8 లక్షలు అవసరం
కమెడియన్ రామచంద్ర పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఇంకా రూ.8 లక్షలు అవసరమని తెలుసుకున్న హీరో సంజోష్ స్పందించారు. ఆయనకు అవసరమైన వైద్య సహాయం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
సినిమా కుటుంబం అండగా నిలవాలి
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న రామచంద్రకు చిత్ర పరిశ్రమకు చెందినవారు, అభిమానులు తమకు తోచిన విధంగా సహాయం అందించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. సినిమా కుటుంబం ఒక్కటై ఆయనకు అండగా నిలిస్తే చికిత్సకు అవసరమైన నిధుల సమీకరణలో తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నారు. రామచంద్ర త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

