
* రైతులకు అండగా బి ఆర్ఎస్ ధర్నా
ఆకేరు న్యూస్, ములుగు:జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమార్రి లక్ష్మణ్ బాబు నియోజకవర్గం ఇన్చార్జి బడే నాగాజ్యోతి లు డిమాండ్ చేశారు.ఇటీవలే కురిసిన వడగళ్ళ భారీ వర్షనికి నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలనే డిమాండ్ తో శనివారం మంగపేట మండలం మల్లూరు మెయిన్ రోడ్డు పై రైతులకు అండగా ధర్నా నిర్వహించారు. రైతుల పక్షాన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంత వరకు ప్రభుత్వం నష్టపరిహారం అందించలేక పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులను రాజులు గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదన్నారు.రైతులకు 24గంటల కరెంట్ అందించాల్సి ఉందన్నారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వానికి కనపడడంలేదా అని ప్రశ్నించారు.
ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వెంటనే సర్వే నిర్వహించి అర్హులైన వారందరికీ నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవిందానాయక్, జిల్లా నాయకులు, కాకులమర్రి ప్రదీప్ రావు,తుమ్మ మల్లారెడ్డి, తాటి కృష్ణ,భూక్యా జంపన్న, PACS చైర్మన్ తోట రమేష్, కునురు అశోక్ ,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్ మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, PACS వైస్ చైర్మన్ కడబోయిన నరేందర్, మల్లూర్ దేవస్థాన మాజీ చైర్మన్ నూతిలకంటి ముకుందం, జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, పార్టీ నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య , కూర్బన్, యడ్లపల్లి నర్సింహారావు బుట్టో,చిలకమర్రి రాజేందర్, గాదె శ్రీనివాస్ చారి,మండల యూత్ అధ్యక్షులు గుమ్మలా వీరాస్వామి, పిఎసిఎస్ చైర్మన్ కూనూర్ అశోక్ గౌడ్, తాడూరి రఘు, కుమ్మరి చంద్రబాబు, జాడి బోజరావు, దేపాక శ్రీరామ్, కన్నబోయిన రాజు యాదవ్, వావిలాల పోశయ్య, మెరుగు వెంకటేశ్వర్లు, పర్వతాలు ఎల్లయ్య, బాసాని శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………….