
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
* ఏపీహెచ్ఎంఈఎల్ సంస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
* ఇబ్రహీంపట్నంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆంధ్ర ప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (APHMEL) ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థ APHMEL ను సింగరేణి సీఎండీ బలరాం తో కలిసి సందర్శించి కార్మికులతో మాట్లడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాలు తయారీ, పాత విడిభాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ సంస్థలకు ఏపీహెచ్ఎంఈఎల్ కన్నామించి మిషనరీ, మానవ వనరులు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సిబ్బంది, అధికారులు ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు సాధిస్తామన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, రాష్ట్రాల ప్రగతికి దోహదపడవచ్చని అన్నారు. ఈ పరిశ్రమ సింగరేణి కాలరీస్ కు అవసరమైన కొత్త యంత్రాలు తయారు చేయడం, పాత యంత్రాల మరమ్మత్తు వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలోనే కాకుండా, దేశానికి అవసరమైన ఆర్డర్స్ తీసుకొని బీహెచ్ ఈ ఎల్ (BHEL) మాదిరిగా ఏపీహెచ్ఎంఈఎల్ (APHMEL) పనిచేస్తుందని, థర్మల్ పవర్ స్టేషన్స్ కు అవసరమైన యంత్రాలు, యంత్రాల మరమ్మతు చేస్తుందని, ఈ సంస్థను భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
………………………………