
* మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఆదేశం
ఆకేరున్యూస్: పాలమూరు, రంగారెడ్డి రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లాలోని నార్లపూర్, వనపర్తి జిల్లాలోని ఏదుల ఫేజ్ 2 రిజర్వాయర్లను సందర్శించారు. ఏదుల రిజర్వాయర్ వద్ద హెలికాప్టర్ ద్వారా చేరుకోగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మంత్రికి పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నా రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బి. సంతోష్ , ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లతో కలిసి ఏదుల రిజర్వాయర్ ఫేజ్ 2ను పరిశీలించారు. అనంతరం ఏదుల టన్నెల్ ను సందర్శించి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇరిగేషన్ శాఖ ఎస్.ఈ విజయ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
………………………………………………..