Computer Skills for Jobs
* డిగ్రీతోపాటు డిజిటల్ స్కిల్స్ తప్పనిసరి!
* కెరీర్‌ను మళ్లీ ప్రారంభిస్తున్న మహిళలు
* డిజిటల్ అక్షరాస్యత పెరగాలి : ఐసీఎస్ఎస్ సంస్థ నిర్వాహకుడు నవనీత్ రావు
ఆకేరు న్యూస్, హనుమకొండ: డిగ్రీ పూర్తయింది. పీజీలో మంచి మార్కులూ వచ్చాయి. చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లతో ఫైల్ నిండిపోయింది. ఉద్యోగ కోసం వెళ్ళినప్పడు ఇంటర్వ్యూలో ఎదురవుతున్న మరో కీలక ప్రశ్న.. మీకు కంప్యూటర్‌పై పనిచేయడం వచ్చా? విద్యార్హతలతో పాటు పని చేయగల నైపుణ్యాలకూ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో కంప్యూటర్ పరిజ్ఞానం అవసరాన్ని హనుమకొండలోని ఐసీఎస్ఎస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు నవనీత్‌రావు వివరించారు.
దేశంలో డిజిటల్ అక్షరాస్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 25 ఏళ్లుగా కంప్యూటర్ శిక్షణ రంగంలో పనిచేస్తున్న ఆయన ఆకేరు న్యూస్‌తో మాట్లాడుతూ.. ఉద్యోగ లక్ష్యానికి అనుగుణంగా కోర్సులను ఎంచుకోవాలని చెప్పారు.
* పదేళ్ల విరామం తర్వాత మళ్లీ విద్యార్థులయ్యారు..
కంప్యూటర్ శిక్షణ కోసం వచ్చే వారిలో విద్యార్థులు, ఉద్యోగార్థులతో పాటు కుటుంబ బాధ్యతల కారణంగా కెరీర్‌కు విరామం ఇచ్చిన మహిళలు కూడా ఉంటున్నారు. వివాహం, పిల్లల పెంపకంతో పదేళ్లు, పదిహేనేళ్లు గడిచిన తర్వాత ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో కొందరు మళ్లీ నేర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనే ఆలోచన వారిని శిక్షణ వైపు నడిపిస్తోంది. పీజీ పూర్తయి సుమారు పదేళ్లు గడిచిన తర్వాత కంప్యూటర్ శిక్షణలో చేరినట్లు హేమలత తెలిపారు. పిల్లల బాధ్యతల వల్ల తరగతులకు హాజరుకాలేని సందర్భాల్లో మళ్లీ నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు.
అర్థంకాని విషయాలను మరోసారి వివరించడం తమలాంటి వారికి ఉపయోగపడుతోందన్నారు. వరంగల్‌కు చెందిన సుహాసిని కూడా ఇదే లక్ష్యంతో శిక్షణ తీసుకుంటున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తిచేసిన తర్వాత వివాహమై, కెరీర్లో పదేళ్ల విరామం వచ్చిందని తెలిపారు. ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, ట్యాలీ నేర్చుకోవడానికి చేరినట్లు వివరించారు. నేను నేర్చుకోగలనా? అన్న భయం నుంచి..కంప్యూటర్‌పై ఏమాత్రం అవగాహన లేకుండానే డీఓఏ కోర్సులో చేరినట్లు సాయిప్రసన్న తెలిపారు.
మొదటి తరగతి నుంచే బోధన అర్థమవడంతో నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగిందని చెప్పారు. ఏఎన్ఎం శిక్షణ పొందిన కళ్యాణికి ఉద్యోగ ప్రయత్నాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం ఎదురైంది. కంప్యూటర్ పని వచ్చా అని అడగడంతో ఆ నైపుణ్యాన్ని నేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొదట్లో నేర్చుకోగలనా అనే భయం ఉన్నప్పటికీ అధ్యాపకుల ప్రోత్సాహంతో ధైర్యం పెరిగిందన్నారు. స్వయంగా నిలబడాలనే సంకల్పంతో శిక్షణకు వచ్చినట్లు చెప్పారు.
* పీజీ చేసిన పదేళ్ళకు కంప్యూటర్ పట్టాను.
నా పేరు హేమలత. పీజీ అయిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేర్చుకుంటున్నవారిలో దాదాపు నాలాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నాకు పెళ్ళయింది. పాప కూడా ఉంది . హాలిడేస్ లో పాపతో ఉండాల్సి వస్తుంది . అప్పుడు క్లాస్లక హాజరు కాలేను కదా .. అప్పుడు మిస్ అయిన క్లాస్ లను కూడా మళ్ళీ చెబుతారు. ఒకసారి చెప్పిన క్లాస్ అర్థం కాకపోయినా, మళ్లీ ఇంకోసారి, ఇంకో బ్యాచ్‌తో కలిపి క్లాస్ చెప్తారు. చాలా గ్యాప్ వచ్చిన వాళ్లకు కూడా ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అనిపించింది. పెళ్ళయి పోయి, పిల్లలు ఉంటే ఇక కెరీర్ ముగిసినట్లే అని భావించకూడదు.

* జాబ్ చేయాలనే ఉద్దేశంతో..
నా పేరు సుహాసిని. నేను వరంగల్ నుంచి వస్తాను. కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేశాను. ఆ తర్వాత 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. జాబ్ చేయాలనే ఉద్దేశంతో ఐసీఎస్ఎస్ ( ICSS ) గురించి గూగుల్‌లో సెర్చ్ చేశాను. డీసీఏలో జాయిన్ అయ్యాను. కోర్సు పూర్తయిన తర్వాత ఏదో ఒక చోట తప్పని సరిగా ఉద్యోగ అవకాశం వస్తుందని అనుకుంటున్నాను.

* క్లాస్ నచ్చింది..
నా పేరు సాయి ప్రసన్న. నేను డీసీఏ కోర్స్‌లో జాయిన్ అయ్యాను. .నార్మల్‌గా ఒకసారి చూద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ వివరాలు చెప్పగానే వెంటనే జాయిన్ అయ్యాను. ఫస్ట్ డేనే నాకు క్లాస్ చెప్పారు. నిజానికి నాకు జీరో నాలెడ్జ్. సిస్టమ్ గురించి గానీ, ఇంకా వేరే విషయాల గురించి గానీ ఏమీ తెలియదు. క్లాస్ తీసుకోగానే నాకు చాలా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, మనకు సర్టిఫికెట్ కూడా వస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్లకు అయితే ఇక్కడ నేర్చుకోవడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందని అనిపిస్తుంది.

* ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్ స్కిల్స్ అడుగుతున్నారు..
నా పేరు కళ్యాణి. నేను ఇంటర్ చదివాను. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. నేను ఏం చేయగలను, ఏం చేయలేను కదా అని అనుకునేదాన్ని. నేను ఏఎన్ఎం చేశాను. అయినా ఎక్కడికి వెళ్లినా కంప్యూటర్ వర్క్ వచ్చా అని అడుగుతున్నారు. కాబట్టి కంప్యూటర్ నేర్చుకోవడం కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాను. . కంప్యూటర్ కోర్స్ గురించి నాకు అసలు జీరో నాలెడ్జ్. . అది నాకు వస్తుందో, రాదో అనే డౌట్‌తో, కొంచెం భయంతో ఇక్కడికి వచ్చాను. కానీ నేను సెల్ఫ్‌గా నిలబడాలి, నేను నేర్చుకోవాలి, నేను ఎందుకు నేర్చుకోలేను అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. క్లాస్‌లో వివరించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. . మీరు చేయగలుగుతారు, మీకు వస్తుంది.. అనే ధైర్యాన్ని మాలో నింపారు.

* డిగ్రీ సర్టిఫికెట్ తోపాటు నైపుణ్యం కావాలి : నవనీత్ రావు
కృత్రిమ మేధ (ఏఐ) వినియోగానికి సంబంధించిన శిక్షణ కూడా అందిస్తున్నామని నవనీత్‌రావు తెలిపారు. ఏఐ సాధనాలకు అవసరాన్ని స్పష్టంగా వివరించే సూచనలు ఇవ్వడం, అంటే ప్రాంప్టింగ్పై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.పైథాన్ వంటి అడ్వాన్స్డ్ కోర్సులకు కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు. విద్యార్థులతో ప్రాజెక్టులు, యాప్ డెవలప్మెంట్ పనులు చేయించడం ద్వారా నేర్చుకున్న విషయాలను ఆచరణలో ఉపయోగించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్న్‌షిప్ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువత నుంచి, కెరీర్‌ను తిరిగి ప్రారంభించాలనుకుంటున్న మహిళల వరకు ఈ ఇంటర్వ్యూలో కనిపించిన ఉమ్మడి అవసరం ఒక్కటే చదువుకు పనిలో ఉపయోగపడే నైపుణ్యాన్ని జోడించడం. సర్టిఫికెట్ విద్యార్హతను చూపిస్తే.. నేర్చుకున్న పనిని స్వయంగా చేయగలగడం అభ్యర్థి సామర్థ్యాన్ని చాటుతుందని నవనీతా రావు అంటున్నారు.
* చదివిన విషయాన్ని పనిలో చూపించగలగాలి..
పాఠ్యాంశంగా కంప్యూటర్ గురించి తెలుసుకోవడానికి, ఉద్యోగంలో అవసరమైన పనిని స్వయంగా చేయడానికి మధ్య వ్యత్యాసం ఉంటుందని నవనీత్‌రావు అన్నారు. ఆ అంతరాన్ని తగ్గించేలా ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఉద్యోగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులు బోధిస్తున్నామని చెప్పారు.డీసీఏ, పీజీడీసీఏతో పాటు కార్యాలయ పనులకు సంబంధించిన డిప్లమా ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ (DAO) వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
కంప్యూటర్‌పై అవగాహన లేనివారు కూడా ప్రాథమిక అంశాల నుంచి నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.కొన్ని కోర్సులకు ప్రభుత్వ సంస్థల నుంచి సర్టిఫికెట్లు అందుతాయని నవనీత్‌రావు చెప్పారు. సంబంధిత సంస్థల ద్వారా వాటిని ధ్రువీకరించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. కోర్సు ఎంపిక సమయంలో శిక్షణతో పాటు సర్టిఫికెట్ జారీ చేసే సంస్థ, దాని గుర్తింపు వివరాలను తెలుసుకోవడం కూడా అవసరమని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

