* ఏరులై పారుతున్న మద్యం, డబ్బు
* అధికార పార్టీలకు తొత్తులుగా పోలీసులు, అధికారులు
* మాజీ మంత్రి హరిశ్‌రావు సంచలన ఆరోపణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ రేపే జరగనుంది. నిన్నటి వరకు నువ్వా.. నేనా అంటూ కాలనీలు, బస్తీలు, వీధుల్లో బహిరంగంగా జరిగిన ప్రచార పర్వం ముగిసింది. ఇప్పుడు ప్రలోభాల పర్వానికి తెర లేచింది. వాటిపై ఫిర్యాదులూ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Ex Minister Harishrao)సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. డబ్బు, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చీరలు, మద్యం పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నేతల వీడియోలను ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి అందజేసినట్లు వివరించారు. యూసుఫ్‌గూడలో పోలింగ్ కేంద్రం పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రచారంలో బీఆర్ ఎస్ ఆదరణను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయన్నారు.
………………………………………….
