
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరువున్న సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో పాడి కౌషిక్ రెడ్డి అనుచితి పోస్టులు పెట్టారని వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్నారు.బీఆర్ ఎస్ నాయకులు కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డిలు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో రాజకీయాలపట్ల ఏహ్యభావం కలిగేలా వీరు వ్యవహరిస్తున్నారని బల్మూరి ఆవేదన వ్యక్తం చేశారు.వీరిద్దరూ సీఎం రేవంత్ రెడ్డి పరువు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బల్మూరి తెలిపారు.
………………………………….