
* బీఆర్ ఎస్ నాయకుల ధ్వజం
ఆకేరు న్యూస్ హనుమకొండ్ : ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని
బీఆర్ ఎస్ నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలుఅన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ బాకీ కార్డుల విడుదల కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు మందు అభయహస్తం పేరుతో ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు ఆరు గాసిప్ లుగా మారాయని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఇంత వరకు అమలు కాలేదని విమర్శించారు. అవ్వకు కోడలుకు ఇద్దరికీ పించన్ అన్నారు. ఇంత వరకు పించన్లు మంజూరు చేయడం లేదన్నారు. బీఆర్ ఎస్ ప్రారంభించిన పనులకు రేవంత్ రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని వారు ప్రజలను కోరారు. కాంగ్రెస్ కు ఓటేసి రైతులు విద్యార్థులు అందరూ మోసపోయారని వారు అన్నారు. కాంగ్రెస్ ఆరు బాకీ కార్డులను ఇంటింటికీ పంచి ప్రజలకు వివరిస్తామని హరీష్ రావు జగదీష్ రెడ్డిలు తెలిపారు.
………………………………………………..