
* బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్
*జూబ్లీహిల్స్ లో బాకీ కార్డుల పంపిణీ
ఆకేరు న్యూస్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్ధాణాలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ DASYAM VINAYA BHASKAR ) ఆరోపించారు. శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్ ( JUBLEE HILLS) ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో పర్యటించారు. ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మందు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్ర.జలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు.6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ 22 నెలలు అయిన ఏ ఒక్క గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సుమారు 50,000 రూపాయలు, వృద్దులకు 44000, దివ్యాంగులకు 44 వేలు బాకీ ఉంది అన్నారు.వేలాది మంది ఆడపిల్లలకు పెళ్లి సందర్భంగా ఇస్తామన్న తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బాకీ ఉందని తెలిపారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇంకా బాకీ ఉందని విమర్శించారు. దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధుకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లొదిలేసిందని ఆరోపించారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల ఆశ చూపి తీరని అన్యాయం చేస్తోందని అన్నారు.హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరుతో పేదల ఇండ్లు ఈ కాంగ్రెస్ సర్కారు కూల్చతోందని తెలిపారు.హైదరాబాద్ నగర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు. కేసీఆర్ గారు 10 ఏండ్లలో తెలంగాణను, హైదరాబాద్‌ను అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగన నిలపడం జరిగిందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరిచి, కోతలు, కూల్చివేతలు, కమిషన్లతో ప్రభుత్వాన్ని నడుపుతోందని విమర్శించారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకు దివంగత నాయకులు మాగంటి గోపీనాథ్ గారు ఎనలేని సేవలు చేశారని, రానున్న ఉప ఎన్నికల్లో గోపీనాథ్ గారి సతీమణి సునీత గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని, కేటీఆర్, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. కాగా ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని గుర్తించారని, రానున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని వినయ భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు.
……………………………………….