
* ధర్నాలో రాహుల్,ప్రియాంక
ఆకేరు న్యూస్ డెస్క్ : బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు(BC RESERVATIONS) కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పరివారం మొత్తం ఢిల్లీ బాట పట్టింది. జంతర్ మంతర్ (JANTHAR MANTHAR)వేదికగా ఢిల్లోలో బిసి రిజర్వేసన్లపై ధర్నా చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే,ఎమ్మెల్సీలు,ఎంపీలు,ముఖ్యనేతలు ,స్థానిక నేతలు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోమొదలు కానున్న ఈ ధర్నాకు ఢిల్లీ పోలీసులు రెండు గంటల పాటు అనుమతినిచ్చారు. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ,( RAHUL GANDHI)ప్రియాంక గాంధీ(PRIYANKA GANDHI)లు పాల్గొననున్నారు.
……………………………………….