
* మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆకేరు న్యూస్, జనగామ : కాంగ్రెస్ అంటేనే మోసం అని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించినందుకు నిరసనగా జనగామ జిల్లా దేవరుప్పులలో బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్ లు, 15 రిజర్వాయర్లు, 21పంప్ హౌస్ లు, 203 కిలోమీటర్ల సొరంగం 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 141 TMC ల స్టోరేజ్ ఇంత పెద్ద ప్రాజెక్టు లో ఒక్క బ్యారేజీలోని 3పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్ట్ పోయినట్టా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో కాలయాపన చేసి మొత్తం గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే కుట్ర జరుగుతోందని అన్నారు. కాళేశ్వరంపై మొత్తం 94 వేల కోట్ల ఖర్చు అయితే ఒక లక్ష కోట్లు అవినీతి జనిగింది అనడం సిగ్గుచేటని ఎర్రబెల్లి అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ కూడా మేడిగడ్డను రిపేర్ చేయాలని సూచించిందని అన్నారు. ఎక్కడో చిన్నలోపం జరిగితే మొత్తం ప్రాజెక్టు పనికిరాకుండా పోతుందా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
………………………………………