
* మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఆకేరున్యూస్, నర్సంపేట: నర్సంపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. నర్సంపేట పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది మాట్లాడుతూ.. సామాన్యుడికి న్యాయం అందడం లేదని, తప్పుడు కేసులు పెడుతూ భయపెడుతున్నారన్నారు.పోలీస్ అధికారులు,కొత్త సిపి,డీసీపీ,కలెక్టర్ నర్సంపేట ప్రాంతంలో జరగుతున్న సంఘటనల మీద ఒక రోజు సమీక్ష చెయ్యాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాలకు రెవెన్యూ,మున్సిపల్, పోలీస్ అధికారులు సహాయం చేయడం తోనే మంగళవారం రోజు జరిగిన రెండు సంఘటనలే నిదర్శనమన్నారు.13 మార్చి వరకు స్టేటస్ కో ఉన్న కూడా ఎందుకు పటించించుకోలేదన్నారు.చాలా కాలం నుండి నర్సంపేటలో నివాసం ఉంటున్న పేద ప్రజల భూములపైన లోపాలను ఎత్తి చూపి భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రజల పక్షాన నిలబడాలని, అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని పెద్ది సూచించారు. ఈ కార్యక్రమంలో ఒడిసిఎంస్ ఛైర్మన్, ఆర్ఎసెస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, పట్టణ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బిఆర్టియు జిల్లా అధ్యక్షులు, ఖానాపూర్ మాజీ ఎంపీపీ, మాజి మార్కెట్ ఛైర్మన్, మాజీ కౌన్సిలర్స్, క్లస్టర్ బాధ్యులు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
……………………………………