
* యూరియా కొరతపై హరీష్ ఆగ్రహం
ఆకేరు న్యూస్ డెస్క్: రైతులకు యూరియా అందించలేని కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగే అర్హత లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదని హరీష్ అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలైన్లలో పెట్టే సాంప్రదాయం ఉండేదని అదే పరిస్థితి మళ్లీ ఇప్పుడు దాపురించిందని హరీష్ విమర్శించారు. ఓ పక్క రైతులు యూరియా దొరకక అవస్థలు పడుతుంటే రేవంత్ సర్కార్ నిమ్మకునీరెత్తినట్లుగా ఉందని హరీష్ ఆరోపించారు.రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. సగం మంది రైతులకు ఇంకా రుణ మాఫీ కాలేదని అన్నారు. ధాన్యం అమ్మి మూడు నెలలు అయినా రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. కేసీ ఆర్ గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడిగితే రేవంత్ రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నాడని హరీష్ ధ్వజమెత్తారు. రైతులకు యూరియా సరఫరా చేయకుంటే ఉద్యమిస్తామని హరీష్ హెచ్చరించారు.
………………………………………………..