YSR Death Anniversary Kondur
* కొండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ 17 వ వర్ధంతి వేడుకలు
* పాల్గొన్న మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి
ఆకేరు న్యూస్, రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని కొండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కొండూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గిరిగాని వేణు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరై వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఈదులకంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, వైయస్సార్ చేసిన సేవలను కొనియాడారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే వెన్నుముక అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు గిరిగాని వేణు నాయకత్వాన్ని ఆయన అభినందించారు.
గ్రామ అధ్యక్షుడు గిరిగాని వేణు మాట్లాడుతూ, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి సూచనల మేరకు గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
