
* జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఆకేరు న్యూస్, వరంగల్: రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ నాయకులను గ్రామగ్రామాన నిలదీయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత అన్నారు. హనుమకొండ లో ఆదివారం జరిగిన సమావేశంలో కవిత మాట్లాడారు.రాహుల్ గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేయించిన విషయాన్ని గుర్తు చేస్తూ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. రైతు డిక్లరేషన్ వల్ల వరంగల్ రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిన రైతులను నిండా ముంచారని ఆరోపించారు. రైతుల విషయంలో చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ మళ్లీ వరంగల్ వచ్చి రైతు డిక్లరేషన్ అమలుకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. రైతు డిక్లరేషన్ లో మొట్టమొదటి అంశం రైతు రుణ మాఫీ మాఫీని సాగదీసి సాగదీసి అమలను ప్రకటించినా … 50 శాతం మంది రైతులకు ఇంకా రైతు రుణ మాఫీ కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీని నమ్మి అనేక మంది రైతులు కొత్తగా రుణాలు తీసుకోగా వారి రుణాలను మాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కౌలు రైతులకు ఏడాదికి రూ 15 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతుల గురించి మాట్లాడడం లేదన్నారు. కౌలు రైతులను మరిచిపోయినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేయాలి ? రైతు బంధు నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేసిందని చెబుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఇటీవల రైతు భరోసాను ప్రకటించారని ఆరోపించారు.అన్ని పంటలకు మద్ధతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ విస్మరించిందన్నారు.మద్ధతు ధరపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతు కూలీలకు సంవత్సరానికి రూ 12 వేలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గ్రామాల్లో నిలదీయాలని పిలుపు నిచ్చారు.ధరణితో నష్టం జరిగిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు.పాత ధరణి వ్యవస్థనే బాగుందని రైతులు అంటున్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం ఊదరగొట్టినా నకిలీ విత్తనాలను కట్టడి చేయడానికి ఏ మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని., వరంగల్ అభివృద్ధికి కేసీఆర్ మొదలుపెట్టిన పనులను ముందుకు తీసుకెళ్లకుండా రేవంత్ రెడ్డి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. మూమునూరు ఎయిర్ పోర్టుకు రాణి రుద్రమా పేరు పెట్టాలని, దీనిపై కేంద్ర మంత్రి,, ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని చెప్పారు. ఆగస్టు 6న జయశంకర్ జయంతి ఉత్సవాలను వరంగల్ లో తెలంగాణ జాగృతి పెద్ద ఎత్తున నిర్వహిస్తుందన్నారు. రైతుల పొలాల్లోకి కృష్ణా, గోదావరి నీళ్లను మళ్లించాలని తెలంగాణ ఉద్యమం సాగిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు 12- 13 సంవత్సరాల్లో 789 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి అప్పటి ప్రభుత్వం దాదాపు 400 మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలెడన్నారు. మిగితా వాళ్లకు చట్టరీత్యా సహాయం చేయలేకపోతే… తెలంగాణ జాగృతి తరఫున 389 మంది రైతు కుటుంబాలకు నాలుగేళ్ల పాటు ప్రతీ నెల 4500 పెన్షన్‌గా అందించామన్నారు. రైతుల సమస్యలపై, రైతుల కోసం తెలంగాణ జాగృతి సంస్థ ఎంతో కృషి చేసిందన్నారు. రైతు సమస్యలను తీరడంపై శాస్త్రవేత్తలతో కూడా తెలంగాణ జాగృతి చర్చలు జరిపిందని, రైతుల కోసం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువులను బాగు చేశారని చెప్పారు. ఈ సమావేశంలో దాస్యం విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………………