* బొల్లు దేవేందర్ ముదిరాజ్
ఆకేరు న్యూస్, ములుగు: తాడ్వాయి మండలం లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రీ సీతక్క చొరవతో 20 నెలలలో అభివృద్ది పథంలో ముందుందని తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్ అన్నారు . మండల కేంద్రము లో విలేకరులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడ్వాయి మండలం లో 11 కోట్ల రూపాయలతో పల్లెల్లో రహదారులు , సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.మేడారం సమ్మక్క- సారలమ్మ 2026 జాతర సందర్భంగా గత ప్రభుత్వ పాలకులు చేయలేని అభివృద్ది పనులను ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మన రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో కాళ్వపల్లి నుండి ఊరట్టం వరకు బీటీ రోడ్డు 5 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందన్నారు, ఇందిరా నగర్ నుండి స్మశాన వాటిక వరకు 1.50 లక్షలతో బీటీ రోడ్డు , రంగాపురం నుండి కొత్తపల్లి గ్రామం వరకు 1కోటి రూపాయలతో బీటీ రోడ్డు మంజూరు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో తాడ్వాయి మండలాన్ని దత్తత తీసుకొని కల్లి బొల్లి మాటలు చెప్పి ఓట్ల కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది నాయకులు మండలంలో ఏం అభివృద్ది చేశారో మండల ప్రజానీకానికి చెప్పాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పల్లెలలో రహదారుల అభివృద్ది కోసం ప్రత్యేక శ్రద్ధ తో రోడ్లు మంజూరు చేయడం జరిగినందుకు తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రీ సీతక్క కు కృతజ్ఞతలు , ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ , మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వర్ రావు , సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య , బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎండీ ముజఫర్ , తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు , మాజీ సర్పంచ్ లక్ష్మీ నారాయణ , సింగిల్ విండో డైరెక్టర్లు యానాల సిద్ది రెడ్డి , రంగరబోయిన జగదీష్ , గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్ , మండల నాయకులు తోట శ్రీ రాములు , మొక్క దుర్గయ్య , తుమ్మల మల్లేష్ , రహమాన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
………………………………………………..
