
* మద్దతు తెలిపిన ప్రియాంకా గాంధీ
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణకు యూరియా సరఫరా చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీల ధర్నాకు ప్రియాంక గాంధీ మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణకు యూరియాను సరఫరా చేయాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన యూరియాను రాకుండా కేంద్రం వివక్ష చూపుతోందని ఎంపీలు ఆరోపించారు. యూరియా కొరతపై పార్లమెంట్ లో మాట్లాడినా కూడా కేంద్రం స్పందించడం లేదని ఎంపీలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 9 మెట్రిక్ టన్నుల యూరియాలో కేంద్రం ఇప్పటి వరకు కేవలం 5 మెట్రిక్ టన్నుల యూరియానే విడుదల చేసిందని విమర్శించారు. మిగతా యూరియాను విడుదల చేయకపోవడంతో తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం బీజేపీ పాలిత ప్రాంతాలకు యూరియాను పంపిణీ చేస్తున్నారని ఎంపీ మల్లు రవి విమర్శించారు.
…………………………………………………