* విద్వేష రాజకీయాలకు కేరాఫ్ బీజేపి
* అర్బన్ నక్సల్స్ అనడం మోది స్థాయికి తగదు
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అని.. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండీ ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోడీ అవినీతిపరులు, విభజన వాదులు, అర్బన్ నక్సలైట్లు అనడం ప్రధాని స్థాయికి తగదని అన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం దేశంలో మత విద్వేషాలు రాజేసేది కేవలం బిజేపి పార్టీ మాత్రమే.. ఇది ప్రజాస్వామిక స్ఫూర్తికి మంచిది కాదని హితవు పలికారు. ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొంతెత్తే వాళ్ళను దేశ ద్రోహులుగా అర్బన్ నక్సల్స్‌గా ముద్రించి నిర్భంధ పాత్ర పోషిస్తున్నదే బిజేపి అని అన్నారు. ఈ దేశంలో మోడీ అమలు పరుస్తున్న ప్రజాస్వామిక వ్యతిరేకత ప్రశ్నించే క్రమంలోనే రాహుల్ గాంధీ దేశం మొత్తం భారత్ జోడో యాత్ర చేసిన విషయం మర్చిపోవద్దన్నారు. జోడొ యాత్ర లక్ష్యమే దేశంలో పెచ్చురిల్లిన మత విద్వేషం, రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామిక విలువల పునాదిగా బయలుదేరిందన్నారు. కాంగ్రెస్‌లో విద్వేషం లేదని ఈ దేశంలో మత రాజకీయాలు విద్వేష రాజకీయాలకు అబద్దాల పునాదిగా పనిచేసేది బిజేపినే అని ప్రజలు గమనిస్తున్నారని.. కాంగ్రెస్ మీద నిరాధారమైన ఆరోపణలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండిరచారు.
…………………………..