
* కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్
ఆకేరున్యూస్, ములుగు: ఈ నెల నాలుగున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలోని అన్ని మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నాయకులు సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీపీసిసి ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,వివిధ మండలాల అధ్యక్షులతో పాటు,యూత్ నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………