
* తాజా పరిణామాలపై చర్చ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : శనివారం సాయంత్రం గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశాం కానుంది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామలపై ముఖ్యంగా సమావేశంలో చర్చించనున్నారు.ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి(REVANTH REDDY) కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్(MEENAKSHI NATARAJAN) పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(MAHESH KUMAR GOUd), మంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అడ్వైజరీ కమిటీ కూడా పాల్గొననున్నట్లు తెలిసంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్ తీర్ప నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిచనున్నారు. అలాగే ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై కీలకంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరు ప్రజల్లో వాటి పట్ల ఆదరణ ఎలా ఉంది అనే విషయాలను కూడా పరిశీలించనున్నారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణం రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్న కమిటీల నిర్మాణంపై చర్చలు నాయకులు చర్చలు జరపనున్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.అయితే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొంతకాలంగా.. అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(RAJ GOPAL REDDY) , సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా యూరియాపై కూడా ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రతిపక్షలు కూడా యూరియా విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. వీటన్నిటికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం కాంగ్రెస్ పార్టీని మరింత ఇరకాటంలో పెట్టిందని చెప్పవచ్చు. కాంగ్రెస్లో అంతర్గత విభేదాల గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కడో ఓ చోటు ఏదో ఒక విధంగా బయటపడుతునే ఉన్నాయి. ఈ అంశాల దృష్ట్యా ఇవాళ నిర్వహించే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
………………………………….