* ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఊరట
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇతర రాష్ట్రాల్లో చదివిన తెలంగాణ ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్(BDS) విద్యార్థులకు హైకోర్టు తీర్పుతో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ చదివినా.. తెలంగాణ వారిని స్థానికులుగానే గుర్తించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు (HIGH COURT) ఆదేశించింది. వారి స్థానికతపై ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 140ని సవరణ చేయాలని గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ మెడికల్ పీజీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 140 ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతో పాటు ఎంబీబీఎస్ కూడా ఇక్కడే పూర్తి చేసిన వారికి తెలంగాణ స్థానికత (TELANGANA LOCAL) కల్పిస్తారు. ఈ జీవో అమలును ప్రస్తుతం హైకోర్టు నిలిపివేసింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారు ఎంబీబీఎస్, బీడీఎస్ ఎక్కడ చేసినా స్థానికులే అని హైకోర్టు పేర్కొంది.
………………………………………