రఘునందన్‌రావు
* కుటుంబ పంచాయితీల్లోకి మా పార్టీని ఎందుకు లాగుతారు
* తెలంగాణలో చెల్లని రూపాయి బీఆర్ ఎస్
* ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాలని బీఆర్ ఎస్ కుట్రలు చేస్తోందని ఎంపీ రఘునందన్ రావు (RAGHUNANDANRAO) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ ఎస్ (BRS)గా మారిన టీఆర్ ఎస్ (TRS)కు ప్రజలు వీఆర్ ఎస్ (VRS) ఇచ్చారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కేసీఆర్ కుటుంబ పంచాయితీల్లోకి తమ పార్టీని ఎందుకు లాగుతారని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ ను విలీనం చేసుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. 2014లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మంత్రి పదవులు తీసుకున్నారని, తాము ప్రజల మనసులు గెలుచుకుని ఎన్నికల్లో గెలిచామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బలపడుతోందని, కేసీఆర్ కుటుంబం(kcr Family)లో పంచాయతీ ఉంటే వాళ్లే తేల్చుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తనపై వ్యక్తిగతంగా బురద జల్లేందుకు యత్నిస్తున్నారని, దొంగే.. దొంగా.. దొంగా అని అరిచినట్లు బీఆర్ఎస్ తీరు ఉందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ చెల్లని రూపాయని విమర్శించారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న పెయిడ్ బ్యాచ్‌లపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టిస్తున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) కూడా ఆరోపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులే పెరిగాయన్నారు. 30 యూట్యూబ్ చానళ్లకు కేటీఆర్ జీతాలు ఇస్తున్నారని,పేపర్, యూట్యూబ్ చానళ్ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, ఒక్క అమరుడి కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని విమర్శించారు.
…………………………………………………..
